Anand Mahindra: జిలేబీ తయారీలో కొత్త పద్ధతి.. నేనింకా అప్‌డేట్ కాలేదేమో..?

జిలేబీ తయారుచేయడంలో టెక్నాలజీని ఉపయోగించడంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఆ మీడియోను మీరూ చూసేయండి.

Published : 21 Feb 2024 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త విషయాలను పంచుకోవడం, సృజనాత్మకతను ప్రోత్సహించడంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఎప్పుడూ ముందుంటారు. ఎన్నో వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజన్లతో తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకుంటుంటారు. జిలేబీ తయారీలో టెక్నాలజీని ఉపయోగించిన ఓ వీడియో ఆయన కంట పడింది. దానిపై ఆయన భిన్నంగా స్పందించారు.

‘‘జిలేబీ అంటే నాకు ఎంతో ఇష్టం. వాటిని చేత్తో తయారుచేయడం ఒక కళ. 3డీ ప్రింటర్‌ టెక్నాలజీని ఉపయోగించి తయారుచేస్తున్న జిలేబీని చూస్తుంటే.. నాకు కాస్త వెరైటీగా అనిపిస్తోంది. టెక్నాలజీపై నేనెంతో ఆసక్తిగా ఉంటా. కానీ.. ఇది చూస్తుంటే నేనింకా పాత పద్ధతుల్లోనే ఉన్నానేమో అనిపిస్తోంది..’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా షేర్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. జిలేబీని చేత్తో చేస్తేనే రుచి ఎక్కువ అంటూ కామెంట్లు గుప్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని