ChatGPT: భారత్‌ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!

భారత వెర్షన్ చాట్‌జీపీటీ గురించి ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw) స్పందించారు. ఇండియన్‌ గ్లోబల్ ఫోరమ్‌ వార్షిక సదస్సులో భాగంగా మాట్లాడుతూ.. సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం వల్ల భారత అంకుర సంస్థలపై ఎలాంటి ప్రభావం పడలేదని చెప్పారు. 

Published : 28 Mar 2023 01:36 IST

దిల్లీ: ఇప్పుడు టెక్ రంగంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు చాట్‌జీపీటీ(ChatGPT). కృత్రిమమేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్ చాట్‌జీపీటీ(ChatGPT)కి ఇండియన్ వెర్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw)కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఏమని బదులిచ్చారంటే..?

‘కొన్ని వారాలు ఆగండి. దీనికి సంబంధించి భారీ ప్రకటన వెలువడుతుంది’ అని వైష్ణవ్‌ సమాధానమిచ్చారు. ఇండియన్‌ గ్లోబల్ ఫోరమ్‌ వార్షిక సదస్సులో భాగంగా సోమవారం ఈ వ్యాఖ్య చేశారు.  అంతర్జాతీయంగా చాట్‌జీపీటీ((ChatGPT) మార్కెట్ పరిమాణం 3.99 బిలియన్ల డాలర్లుగా ఉండొచ్చని అంచనా.  దాదాపు అన్ని టెక్‌ దిగ్గజ సంస్థలు తమ వెర్షన్లను పరిచయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దీనిపై ప్రకటన వస్తుందని మంత్రి చెప్పారు. 

అలాగే సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభం తర్వాత దాని ప్రభావం భారత్‌కు చెందిన ఒక్క అంకుర సంస్థపై కూడా పడలేదని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం సత్వరమే స్పందించి, సహకరించడమే కారణమన్నారు. గత కొన్నేళ్లుగా అంకుర సంస్థలకు  సిలికాన్ వ్యాలీ బ్యాంక్(Silicon Valley Bank) ప్రధానంగా నిధులు సమకూర్చేది. ఈ బ్యాంక్ పతనం.. భారత స్టార్టప్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని