Assembly Elections: ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలపై కొనసాగనున్న నిషేధం

రాజకీయ పార్టీల రోడ్‌షోలు, పాదయాత్రలపై నిషేధాన్ని కొనసాగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న......

Published : 07 Feb 2022 01:43 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో.. రాజకీయ పార్టీల రోడ్‌షోలు, పాదయాత్రలపై నిషేధాన్ని కొనసాగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్​, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులకు గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కాగా బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాల నిర్వహణకు మరిన్ని సడలింపులు కల్పించింది.

అధికారుల అనుమతితో నిర్ణీత ప్రదేశాల్లో బహిరంగ సభలకు 1000 మందికి అనుమతించింది. లేదా సభా ప్రాంగణంలో 50 కెపాసిటీ ఉండొచ్చని పేర్కొంది. అలాగే, ఇంటింటి ప్రచారానికి 20 మంది వరకు బృందంగా వెళ్లొచ్చని స్పష్టంచేసింది. ఇండోర్‌లలో జరిగే సమావేశాలకు గతంలో 300 మందికి మించరాదని పరిమితి విధించిన ఈసీ.. ఈసారి ఆ సంఖ్యను 500వరకు పెంచింది. లేదా 50 శాతం సీటింగ్‌ కెపాసిటీ మాత్రమే ఉండాలంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండేలు ఆదివారం సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఆ వ్యాప్తిని మళ్లీ పెంచకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. నేతలు కొవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటించాలని పునరుద్ఘాటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని