Pakistan- China Relations: పాకిస్థాన్‌ చేస్తున్న ఈ పనికి చైనా ప్రశంస

పాకిస్థాన్‌ విషయంలో చైనా సానుకూల ధోరణి మరోసారి వెల్లడైంది. జులై 14న ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావీన్సులో బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది చైనీయులతోపాటు పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన విషయంలో పాక్‌ దర్యాప్తుపై డ్రాగన్‌ సంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 13 Aug 2021 23:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ విషయంలో చైనా సానుకూల ధోరణి మరోసారి వెల్లడైంది. జులై 14న ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్సులో బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది చైనీయులతోపాటు పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన విషయంలో పాక్‌ దర్యాప్తుపై డ్రాగన్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. పాక్‌ ప్రయత్నాలను ప్రశంసిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో మంచి పురోగతి కనబర్చిందన్నారు. ‘పాకిస్థాన్‌ వివరాల ప్రకారం.. ఈ దాడికి అఫ్గాన్‌లో ప్రణాళిక రచించారు. ‘తెహ్రీక్‌ ఏ తాలిబాన్‌’ స్వాత్‌ ఛాప్టర్‌కు చెందినవారు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఉగ్రవాద సంస్థకు భారత్‌, అఫ్గాన్‌ నిఘా సంస్థల నుంచి మద్దతు లభించింది’ అని చైనా తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.  ఇటీవల పాక్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషీ సైతం ఇదే విధమైన ఆరోపణలు చేశారు. భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ఉగ్రవాదాన్ని ఉపయోగించుకునే ఏ శక్తినైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొనడం గమనార్హం. మరోవైపు పాక్‌ ఆరోపణలను భారత్‌ ఖండించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని