Alert: అలాంటి మెసేజ్‌లతో జాగ్రత్త: కేంద్రం హెచ్చరిక

సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మొబైల్‌ఫోన్ల వేదికగా అమాయకులను.......

Updated : 05 Sep 2022 09:09 IST

దిల్లీ: సైబర్‌ కేటుగాళ్లు రోజుకో కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. మొబైల్‌ఫోన్ల వేదికగా అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ వల విసురుతున్నారు. ఫలానా లింక్‌పై క్లిక్‌ చేసి రిజిస్టర్‌ చేసుకుంటే ఉద్యోగాలు వస్తాయి.. డబ్బులొస్తాయంటూ ఆశలు రేపి నిలువునా దోచేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట అలాంటి నకిలీ ఎస్‌ఎంఎస్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్‌ యోజన కింద అర్హులైన వ్యక్తులకు నెలవారీగా ఆకర్షణీయమైన శాలరీ వస్తుందని.. ఇందుకోసం కింద పేర్కొన్న లింక్‌పై క్లిక్‌ చేయాలంటూ వస్తోన్న సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్‌ యోజన కింద రూ.78,856ల శాలరీకి మీరు ఎంపికయ్యారు. ఈ లింక్‌పై క్లిక్‌ చేస్తే నెలకు రూ.50వేలు చొప్పున ఆదాయం పొందొచ్చంటూ ఉన్న స్క్రీన్‌ షాట్‌ని కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. ఇది పూర్తిగా నకిలీ సందేశమని.. ఇలాంటివాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. అలాంటి పథకమేదీ కేంద్ర ప్రభుత్వం అమలుచేయడంలేదని స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని