పంజాబ్‌ గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు

పంజాబ్‌, హరియాణాలోని దాదాపు 20 ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగినట్లు సమాచారం......

Published : 29 Jan 2021 12:30 IST

దిల్లీ: పంజాబ్‌, హరియాణాలోని దాదాపు 20 ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగినట్లు సమాచారం. గోదాముల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు అందిన సమాచారం మేరకే తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలతో నేరుగా లావాదేవీలు జరిగే ఇలాంటి ప్రదేశాల్లో అవినీతిని అరికట్టేందుకే ఈ సోదాలు జరిపినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ విజిలెన్స్‌ బృందాలు కూడా తనిఖీల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలు ఇటీవల తీవ్ర పరిణామాలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమాల్లో అత్యధిక మంది పంజాబ్‌ నుంచి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ సోదాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇవీ చదవండి...

రైతు ఉద్యమకారులపై ఉచ్చు

రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని