ఆప్‌ సర్కార్‌ ‘ఇంటింటికీ రేషన్‌’కు మళ్లీ బ్రేక్‌

కేజ్రీవాల్‌ సర్కారు తలపెట్టిన ఇంటివద్దకే రేషన్‌ సరకుల కార్యక్రమానికి మరోసారి బ్రేక్‌ పడింది. 72 లక్షల మంది లబ్ధిదారులకు మేలు చేసే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేసిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Published : 05 Jun 2021 22:17 IST

దిల్లీ: కేజ్రీవాల్‌ సర్కారు తలపెట్టిన ఇంటివద్దకే రేషన్‌ సరకుల కార్యక్రమానికి మరోసారి బ్రేక్‌ పడింది. 72 లక్షల మంది లబ్ధిదారులకు మేలు చేసే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేసిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి మార్చిలోనే దీన్ని ప్రారంభించాల్సి ఉండగా కేంద్రం అడ్డుచెప్పడంతో అప్పట్లో నిలిచిపోయింది. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ విరుచుకుపడింది. రేషన్‌ మాఫియాతో ఉన్న సంబంధాల కారణంగానే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ట్విటర్‌లో విమర్శలు గుప్పించింది.

ఆప్‌ సర్కారు ‘ఇంటింటికీ రేషన్‌’ అందజేసే పథకాన్ని మార్చిలో కేంద్రం అడ్డుకుంది. ఈ స్కీమ్‌ వల్ల లబ్ధిదారులు ఆహారభద్రతా చట్టం నిర్ణయించిన ధరల కంటే, ప్యాకేజీ, హ్యాండ్లింగ్‌కు అదనపు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆప్‌ సర్కారు మాత్రం లబ్ధిదారులు రేషన్‌ దుకాణాలకు వెళ్లకుండానే సరకులు పొందడంతో పాటు, దీనిద్వారా అక్రమాలను అరికట్టవచ్చని చెబుతోంది. తొలుత ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి ఘర్‌ ఘర్‌ రేషన్‌ యోజన’గా ఆప్‌ సర్కారు పేరు పెట్టింది. కానీ కేంద్రం అభ్యంతరం తెలుపడంతో ‘ముఖ్యమంత్రి’ పేరును తొలగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని