China: గల్వాన్‌లోయపై చైనా మరో ప్రచార వీడియో విడుదల..!

గల్వాన్‌లోయపై చైనా మరో ప్రచార వీడియోను విడుదల చేసింది. దీనిని గ్లోబల్‌ టైమ్స్‌ సీపెక్‌ రిపోర్టర్‌ షెన్‌ షివీ ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. గల్వాన్‌లోయలో

Updated : 03 Jan 2022 17:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గల్వాన్‌లోయపై చైనా మరో ప్రచార వీడియోను విడుదల చేసింది. దీనిని గ్లోబల్‌ టైమ్స్‌ సీపెక్‌ రిపోర్టర్‌ షెన్‌ షివీ ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. గల్వాన్‌లోయలో నూతన సంవత్సరం సందర్భంగా చైనా పతాకం ఎగిరిందని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోలో కొందరు చైనా సైనికులు ఓ నది ఒడ్డున  నిలబడి ఉన్నారు. వీరిలో ఏడుగురు సైనికులు చైనా పతాకాన్ని అన్ని వైపుల పట్టుకొని ప్రదర్శించారు. వీరిలో  ఒక మహిళ కూడా ఉంది. సైనికులు నిలబడిన ప్రాంతంలో రెయిలింగ్‌, క్యాంప్‌ల వంటి నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోను ఓ డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఈ వీడియోను భారత సైనిక వర్గాలు ఓ ప్రచార చిత్రంగా కొట్టిపారేశాయి. చైనా గల్వాన్‌ లోయలో పతాకాన్ని ప్రదర్శించిన ప్రాంతం నిస్సైనిక మండలంలో లేదని పేర్కొన్నాయి. చైనా ఆధీనంలోని ప్రాంతంలోనే దీనిని ప్రదర్శించిందని పేర్కొన్నాయి. వివాదాస్పద ప్రదేశం నుంచి ఇరు పక్షాలు 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్లాలని గతంలో భారత్‌-చైనా అంగీకరించాయి. తాజాగా పతాక ప్రదర్శన జరిగిన ప్రదేశంలో నిర్మాణాలు కనిపించడంతో చైనా స్థావరంగా భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు