ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్‌ స్కోరు: ఈటీఎస్‌

ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్‌ (ద టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) సోమవారం ప్రకటించింది.

Published : 07 May 2024 04:33 IST

దిల్లీ: ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్‌ (ద టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారెన్‌ లాంగ్వేజ్‌) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) సోమవారం ప్రకటించింది. గతేడాది జులైలో ఆస్ట్రేలియా హోం వ్యవహారాల విభాగం (డీహెచ్‌ఏ) టోఫెల్‌పై సమీక్షించి, ఇకపై ఈ స్కోర్లను ఆమోదించబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టోఫెల్‌ను నిర్వహించే, ప్రిన్స్‌టన్‌ కేంద్రంగా పనిచేసే ఈటీఎస్‌ సంస్థ స్పందించింది. మే 5, 2024 నుంచి నిర్వహించే పరీక్షల్లో సాధించిన స్కోరును ఆస్ట్రేలియా వీసా అవసరాల నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటారంది. ‘‘డీహెచ్‌ఏ గతేడాది చేపట్టిన సమీక్ష ప్రక్రియను అనుసరించి టోఫెల్‌ఐబీటీలో మార్పులు చేశాం. అనంతరం మార్పులకు ఆమోదం లభించింది’’ అని ఈటీఎస్‌ ఇండియా, దక్షిణాసియా మేనేజర్‌ సచిన్‌జైన్‌ తెలిపారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని