వీసీల నియామకంపై రాహుల్‌ అసత్య ప్రచారం

విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు.

Published : 07 May 2024 04:33 IST

181 మంది విద్యావేత్తల బహిరంగ లేఖ

దిల్లీ: విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల నియామకాలపై రాహుల్‌ అసత్య ఆరోపణలు చేశారు. ఆయనపై వెంటనే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని అందులో పేర్కొన్నారు. వీసీల నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఈ లేఖపై జేఎన్‌యూ వీసీ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌, దిల్లీ యూనివర్సిటీ వీసీ యోగేశ్‌ సింగ్‌, ఏఐసీటీఈ ఛైర్మన్‌ టీజీ సీతారాం, బీఆర్‌ అంబేడ్కర్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ వీసీ తదితరులు సంతకం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్నవారిని విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతులుగా కేంద్రం నియమిస్తోందని రాహుల్‌ గాంధీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని