ప్రజ్వల్‌ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్‌లైన్‌’

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది.

Updated : 07 May 2024 06:20 IST

ఈనాడు, బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. 63609 38947 నంబరుకు ఫోను చేస్తే వారికి చట్టపరమైన రక్షణ కల్పిస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కేసులతో తమకెలాంటి సంబంధం లేదని, ఇందులో తమ పేర్లు ప్రస్తావించకూడదని మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి కోర్టు మెట్లెక్కారు. వారి వినతి మేరకు సంబంధిత వ్యవహారాల్లో వారి పేర్లు వాడకుండా కోర్టు స్టే విధించింది. కిడ్నాప్‌ కేసుల్లో సిట్‌ అధికారుల అదుపులో ఉన్న హెచ్‌.డి.రేవణ్ణను సోమవారం పోలీసులు విచారించారు. పోలీసుల ప్రశ్నలన్నింటికీ ‘ఏమీ తెలియదు’ అనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు బెంగళూరులోని రేవణ్ణ నివాసంలో బాధిత మహిళలను విచారించారు. ఈ సందర్భంగా ఆ విచారణకు హాజరు కావాలని రేవణ్ణ భార్య భవానీకి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ రేవణ్ణ జాడ ఇంకా తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని