Jammu Kashmir: కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూ-కశ్మీర్‌లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Updated : 07 May 2024 13:42 IST

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) కుల్గాం జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయుతే మృతి చెందిన ఉగ్రవాదుల సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కుల్గాంలోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల  గురించి భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో  సోమవారం అర్థరాత్రి ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయని అధికారులు తెలిపారు. చొచ్రు గాలా ప్రాంతంలోని పనారా గ్రామంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లుగా వెల్లడించారు.

ఇటీవల ఏప్రిల్ 29న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్మూ జోన్) ఆనంద్ జైన్ మాట్లాడుతూ రెండు ఉగ్రవాద వర్గాలకు చెందిన కొందరు సరిహద్దు దాటి అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని, వారు ఇదే ప్రాంతంలో తలదాచుకుంటున్నట్లుగా అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి.  రెండు వర్గాలకు చెందిన ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా దళాలు కథువా జిల్లాలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు