సుప్రీంకోర్టుకు హేమంత్‌ సోరెన్‌

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఝార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

Updated : 07 May 2024 05:54 IST

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఝార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ నెల 13న ఝార్ఖండ్‌లో పోలింగ్‌ జరగనుందని, ప్రచారం చేసుకోవడానికి తన కక్షిదారుకు అనుమతి ఇవ్వాలని సోరెన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. దీనిపై ఈ నెల 7న విచారణ నిర్వహిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. భూకుంభకోణానికి సంబంధించి సోరెన్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. జనవరి 31న ఆయన అరెస్టయ్యారు. అప్పటి నుంచి జైలులో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని