సీఐఎస్‌సీఈ 10, 12 ఫలితాల వెల్లడి

సీఐఎస్‌సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది.

Published : 07 May 2024 04:29 IST

మరోసారి సత్తా చాటిన బాలికలు

దిల్లీ: సీఐఎస్‌సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 99.47, 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 98.19గా నమోదైంది. గతేడాది ఇవి వరుసగా 98.94 శాతం, 96.93 శాతంగా ఉన్నాయి. 10లో బాలురు 99.31 శాతం, బాలికలు 99.65 శాతం చొప్పున పాసయ్యారు. 12లో బాలురు 97.53 శాతం, బాలికలు 98.92 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు సీఐఎస్‌సీఈ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, సెక్రటరీ జోసెఫ్‌ ఎమ్మాన్యుల్‌ వెల్లడించారు. విద్యార్థుల మధ్య అనారోగ్యకర పోటీని నివారించేందుకు ఈ ఏడాది నుంచి ప్రతిభా పత్రాల (మెరిట్‌ లిస్టుల) జారీని నిలిపేసినట్లు ఆయన తెలిపారు. సీబీఎస్‌ఈ గతేడాది నుంచే ప్రతిభా పత్రాల పంపిణీని ఆపేసింది. 10వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 28 మధ్య 18 రోజుల పాటు ఐసీఎస్‌ఈ; 12వ తరగతి వారి కోసం  ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్‌ 4 మధ్య 28 రోజుల పాటు ఐఎస్‌సీ పరీక్షలు నిర్వహించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు