Gas Cylinder : తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

Updated : 01 Apr 2023 08:51 IST

దిల్లీ: వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్ర చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను ₹91.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ₹2,028కు తగ్గింది. తగ్గించిన ధర నేటి నుంచే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత నెలలో వాణిజ్య సిలిండర్‌పై ₹350.50, డొమెస్టిక్‌ సిలిండర్‌పై ₹50 మేరకు పెంచిన విషయం తెలిసిందే.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని