Kharge: అందువల్లే 30లక్షల ఉద్యోగ ఖాళీల్ని కేంద్రం భర్తీ చేయట్లేదు: ఖర్గే విమర్శలు

కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 30లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలేదంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మోదీ సర్కార్‌పై విమర్శలు సంధించారు. 

Updated : 20 Jun 2023 19:38 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో భారీగా ఉన్న ఉద్యోగ ఖాళీలను(Vacant Jobs) భర్తీ చేయడంలేదంటూ మోదీ(PM Modi) సర్కార్‌పై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) మండిపడ్డారు. 2014లో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీలు రెట్టింపై ఆ సంఖ్య 30లక్షలకు చేరుకుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకమని.. అందువల్లే ఉద్యోగాలను భర్తీ చేయడంలేదని ఆరోపించారు.  2014 వరకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో  11.57శాతం ఉద్యోగ ఖాళీలు ఉండగా.. 2022 నాటికి ఆ సంఖ్య 24.3శాతానికి పెరిగిందంటూ ఓ ఛార్ట్‌ను షేర్ చేశారు. 

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు మోదీ సర్కార్‌ ఎన్నడూ ప్రాధాన్యం ఇవ్వలేదని.. 2014తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలు రెట్టింపు అయ్యాయంటూ ఖర్గే ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. మోదీ సర్కార్‌ దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీనవర్గాలకు వ్యతిరేకమని.. అందుకే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలేదని విరుచుకుపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని