Congress-RJD: సోనియాగాంధీ, లాలూ లక్ష్యాలివే: అమిత్‌ షా

కేంద్రమంత్రి అమిత్‌ షా నేడు బిహార్‌ (Bihar)లో పర్యటించారు. తమ భాజపా ప్రభుత్వమే ప్రజలకు మేలు చేస్తుందని వెల్లడించారు. 

Published : 09 Mar 2024 17:17 IST

పట్నా: కాంగ్రెస్(Congress), ఆర్జేడీ(RJD) అగ్ర నాయకులు తమ కుటుంబాల ఎదుగుదల కోసమే పాటుపడ్డారని, పేదల కోసం ఏమీ చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah) దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, భాజపా మాత్రమే పేదలకు మంచి చేయగలవన్నారు. శనివారం బిహార్‌లో పర్యటించిన ఆయన భాజపా ఓబీసీ మోర్చా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

‘కాంగ్రెస్‌లోని అగ్రనాయకులు ఎప్పుడూ వారి కుటుంబం కోసమే పని చేశారు. వెనకబడిన వర్గాల పేరు చెప్పి.. లాలూ తన జీవితమంతా కుటుంబం కోసమే పాటుపడ్డారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం సోనియాగాంధీ ఏకైక లక్ష్యం. మరోవైపు లాలూజీ లక్ష్యం తన కుమారుడు తేజస్వీయాదవ్‌ను సీఎం చేయడం. పేదలకు మంచి చేయగలిగేది కేవలం మోదీ, భాజపా మాత్రమే. పేదల నుంచి భూమిని లాగేసుకున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేస్తుంది. లాలూయాదవ్‌ను హెచ్చరించేందుకే ఇక్కడికి వచ్చాను. మరోసారి ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ల్యాండ్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని అమిత్‌ షా అన్నారు.

అలాగే సుదీర్ఘకాలం కాంగ్రెస్-ఆర్జేడీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ.. బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్‌ను గౌరవించలేదని విమర్శించారు. మోదీ ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించి సత్కరించారని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని