వారంలో 10 లక్షల మందికి వైరస్‌

ఐరోపా దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక గణాంకాలు వెల్లడించింది. గత వారం రోజుల్లో ఐరోపా వ్యాప్తంగా 10 లక్షల మంది వైరస్‌ బారిన పడినట్లు తెలిపింది.

Published : 07 Mar 2021 11:35 IST

లండన్‌: ఐరోపా దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక గణాంకాలు వెల్లడించింది. గత వారం రోజుల్లో ఐరోపా వ్యాప్తంగా 10 లక్షల మంది వైరస్‌ బారిన పడినట్లు తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే 9 శాతం మేర కేసులు పెరిగినట్లు పేర్కొంది. వైరస్‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇటలీలోని బోలెట్‌ ఒకటిగా ఉందన్న డబ్ల్యూహెచ్‌ఓ కరోనా విజృంభణ అక్కడి పాఠశాలలకు సైతం పాకినట్లు వివరించింది. ఫలితంగా 45 మంది చిన్నారులు, 14 మంది సిబ్బంది ఇటీవల వైరస్‌ బారిన పడినట్లు తెలిపింది. వైరస్‌లో చోటుచేసుకుంటున్న జన్యు మార్పులు వైరస్‌ను మరింత వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఐరోపా ప్రాంతీయ అధికారి డాక్టర్‌ హన్స్‌ క్లూజ్‌ పేర్కొన్నారు. గతేడాది ఇంగ్లాడ్‌లో వైరస్‌ కొత్త వేరియంట్‌ను గుర్తించామన్న ఆయన అది ఐరోపా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని