Drugs: తీరానికి కొట్టుకొచ్చిన 250 కేజీల డ్రగ్స్‌..!

Drugs washed up on Ratnagiri beaches: మహారాష్ట్రలోని కొన్ని బీచ్‌ల్లో వందల కిలోల మాదకద్రవ్యాలు తీరానికి కొట్టుకొచ్చాయి. స్మగ్లింగ్‌ కోసమే వాటిని సముద్రంలోకి విసిరేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Updated : 21 Aug 2023 18:07 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లోని రత్నగిరి (Ratnagiri) జిల్లాలో గత వారం రోజులుగా తీర ప్రాంతాలకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు (Drugs) కొట్టుకొచ్చాయి. ఆరు రోజుల్లో 250 కేజీలకు పైగా హశీష్‌ (ఒక రకం డ్రగ్స్‌)ను కస్టమ్స్‌ విభాగం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. (Drugs washed up on Ratnagiri beaches)

ఆగస్టు 14 నుంచి 19వ తేదీ మధ్య కర్దే, లద్ఘర్‌, కెల్షి, కొల్తారే, మురుద్‌, బురోంది, బోరియా బీచ్‌లు, దభోల్‌ క్రీక్ నుంచి ఈ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత కర్దే బీచ్‌లో ఆగస్టు 14వ తేదీన 12 కేజీల బరువున్న పది ప్యాకెట్లను గుర్తించారు. వాటిని పరిశీలించగా.. హశీష్‌ డ్రగ్స్‌ (hashish Drugs) అని తేలినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత వరుసగా మిగత బీచ్‌ల్లోనూ ఈ ప్యాకెట్లను గుర్తించినట్లు తెలిపారు.

లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి.. తాపీగా హోంవర్క్‌ చేసుకుంటూ..

అఫ్గానిస్థాన్‌ (Afghanisthan) నుంచి ఈ డ్రగ్స్‌ వచ్చినట్లు కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. విదేశీ నౌకల నుంచి ఇది సముద్రంలో పడిపోయి ఉంటుందని, లేదా ఉద్దేశపూర్వకంగానే స్మగ్లింగ్‌ కోసం దీన్ని పడేసి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఈ మాదకదవ్ర్యాలను గుర్తించిన అధికారులు.. ఈ ప్రాంతాల్లో మరిన్ని సోదాలు చేపడుతున్నారు. తీర ప్రాంతాల్లో ఇలాంటి అనుమానాస్పద ప్యాకేజీలు కన్పిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని