
ప్రభుత్వం నాకు పాస్‌పోర్టు ఇవ్వట్లేదు: ముఫ్తీ
శ్రీనగర్: దేశ భద్రత పేరుతో ప్రభుత్వం తనకు పాస్‌పోర్టు జారీ చేయట్లేదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఇవేనా కశ్మీర్‌లో నెలకొన్న సాధారణ పరిస్థితులు అంటూ ట్విటర్ వేదికగా కేంద్రంపై మండిపడ్డారు.
‘‘దేశ భద్రతకు హానికరం’ అని సీఐడీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని పాస్‌పోర్ట్ కార్యాలయం నాకు పాస్‌పోర్టు జారీ చేసేందుకు నిరాకరించింది. మాజీ సీఎం పాస్‌పోర్టును కలిగి ఉండటం దేశ సార్వభౌమత్వానికి ముప్పు అట. 2019 ఆగస్టు నుంచి కశ్మీర్ సాధించిన సాధారణ స్థితి ఇది’’అని మెహబూబా ట్వీట్ చేశారు.
2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ముఫ్తీ సహా పలువురు రాజకీయ నేతలను గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. గతేడాది ఆమెను ప్రభుత్వం విడుదల చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.