Punjab: వ్యక్తి కడుపులో ఇయర్‌ఫోన్స్‌, నట్లు, బోల్టులు.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి పలు రకాల వస్తువులు మింగేశాడు. తీవ్ర కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతణ్ని ఆస్పత్రిలో చేర్పించారు. 

Published : 28 Sep 2023 17:22 IST

చండీగఢ్‌ : పంజాబ్‌లోని (Punjab) మోగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడుపులో ఉన్న ఇయర్‌ఫోన్స్‌, తాళం, తాళం చెవి, బోల్టులు, నట్లు, వాచర్లు, తదితర వస్తువులను వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అతడు రాత్రుళ్లు నిద్రపోకుండా కూర్చోవడం చూసి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే స్కాన్‌ తీయగా.. బాధితుడి కడుపులో పలు రకాల వస్తువులున్నట్లు తేలింది. దాంతో వైద్యులు సుమారు మూడు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి ఆ వస్తువులన్నింటినీ తొలగించారు.

ఆకలి తీర్చిన మహనీయుడా.. ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు!

ఇలాంటి కేసును తన వైద్య వృత్తిలో తొలిసారి చూశానని ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ అజ్మేర్‌ కర్లా తెలిపారు. చాలా రోజుల నుంచి బాధితుడి కడుపులో ఆ వస్తువులు ఉన్నట్లు తెలిసింది. మానసిక స్థితి సరిగా లేని ఆ వ్యక్తి వాటిని ఎప్పుడు మింగేశాడో తమకు అవగాహన లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ వస్తువులను తొలగించినా అతడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి కుదుటపడలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని