Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. మార్చి 18న కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.

Updated : 17 Mar 2024 14:15 IST

దిల్లీ: దిల్లీ (Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అధికారులు వరుసగా రెండు సమన్లు జారీ చేశారు. దిల్లీ జల మండలిలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో మార్చి 18న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అంతకముందు శనివారం సాయంత్రం దిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి మార్చి 21న విచారణకు హజరుకావాలని తొమ్మిదోసారి సమన్లు జారీ చేశారు. గతంలో ఇదే కేసులో జారీ చేసిన వాటికి ఆయన స్పందించకపోవడంతో దిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్‌ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. అదే రోజే సాయంత్రం, మరుసటి రోజు ఆయనకు సమన్లు జారీ చేయడంపై ఆప్‌ వర్గాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. 

దిల్లీ జలమండలికి సంబంధించిన కేసులో తప్పుడు కేసు నమోదు చేశారని దిల్లీ మంత్రి అతిశీ ఆరోపించారు. ‘‘దిల్లీ జలమండలి బోర్డు కేసు గురించి ఎవరికీ తెలియదు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయలేమని భావించిన కేంద్రం మరో తప్పుడు కేసుతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన్ను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు భాజపా పన్నిన కుట్రలో భాగమే తాజా సమన్లు’’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని