టీకా తీసుకున్న ప్రథమ మహిళ

దేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్‌ నేడు కరోనా టీకా తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆమె వ్యాక్సిన్‌ వేయించుకోవడం విశేషం.

Published : 08 Mar 2021 16:09 IST

దిల్లీ: దేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్‌ నేడు కరోనా టీకా తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆమె వ్యాక్సిన్‌ చేయించుకోవడం విశేషం. దిల్లీలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆర్మీ ఆసుపత్రిలో ఆమె కొవిడ్‌టీకా‌ తొలి డోసు తీసుకున్నారు. ఆమె వెంట కుమార్తె స్వాతి ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ‘‘మహిళా దినోత్సవం నాడు మహిళా సాధికారత కోసం ఈ టీకా’’ అని రాసుకొచ్చింది. 

అంతకుముందు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మనదేశంలో మహిళలు విభిన్న రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తూ.. రికార్డులు సృష్టిస్తున్నారు. స్త్రీ, పురుష అసమానతల్ని నివారించడానికి సమష్టిగా కృషి చేయాలి’ అని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు.

దేశంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టే టీకా పంపిణీ కార్యక్రమంలో నిరాటంకంగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా వ్యాక్సిన్లు తీసుకున్నారు. మార్చి 1న రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభమమైన రోజున ప్రధాని మోదీ తొలి డోసు వేయించుకోగా.. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా 60ఏళ్లు పైడిన పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు టీకా తీసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని