Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

Updated : 19 Mar 2024 15:20 IST

గడ్చిరోలి : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా భద్రతా బలగాలు వీరిని చుట్టుముట్టాయి. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. చనిపోయిన మావోయిస్టులంతా తెలంగాణ కమిటీకి చెందినవారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరిపై రూ.36 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. మృతులను మంచిర్యాల డివిజన్‌ కమిటీ సెక్రటరీ వర్గీస్‌, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్‌ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌లుగా గుర్తించారు. ఘటనాస్థలంలో ఏకే-47, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని