ఇక రోహింగ్యాలపై దృష్టి: కేంద్ర మంత్రి

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం దేశంలోకి.......

Published : 04 Jan 2020 16:15 IST

జమ్మూ: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం దేశంలోకి చొరబడ్డ రోహింగ్యాలను తిప్పి పంపడంపై దృష్టి సారించనుందని తెలిపారు. ‘‘జమ్మూకశ్మీర్‌ సహా దేశవ్యాప్తంగా సీఏఏ అమలులోకి రానుంది. ఇక తరువాతి నిర్ణయం రోహింగ్యాలకు సంబంధించే ఉంటుంది. జమ్మూలో వారి జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. వారి జాబితాను సిద్ధం చేసి బయోమెట్రిక్‌ కూడా సేకరిస్తాం. వారంతా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందే. దీనిపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. సీఏఏ ద్వారా వారికి ఎలాంటి మినహాయింపు ఉండదు. వారిని దేశం నుంచి పంపడంపై ప్రభుత్వం మార్గాల్ని అన్వేషిస్తోంది’’ అని జితేంద్ర సింగ్‌ అన్నారు.

మయన్మార్‌ సైన్యం ఊచకోతతో రఖానే రాష్ట్రంలోని రోహింగ్యా ముస్లింల పరిస్థితి దయనీయంగా మారిన విషయం తెలిసిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని లక్షలాది మంది శరణార్థులుగా భారత్‌, బంగ్లాదేశ్‌ సహా ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే తాజా పౌరసత్వ చట్టంలో పేర్కొన్న ఆరు వర్గాల్లో వీరు లేకపోవడంతో దేశం విడిచి వెళ్లాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని