వాటి ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం

సర్జికల్‌ మాస్క్‌లు, గ్లోవ్స్‌పై ఉన్న ఎగుమతి నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వ్యక్తి భద్రతకు సంబంధించిన అన్ని ఉత్పత్తుల

Published : 10 Feb 2020 00:45 IST

న్యూదిల్లీ: సర్జికల్‌ మాస్క్‌లు, గ్లోవ్స్‌పై ఉన్న ఎగుమతి నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని ఉత్పత్తుల ఎగుమతులపై గత నెలలో ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకసారి వినియోగించే పారేసే మాస్క్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

చైనాలో కరోనా వైరస్‌ బారిన పడి 800మందికి పైగా మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో మాస్క్‌లు, సర్జికల్‌ గ్లోవ్స్‌ను ఎగుమతి చేసేందుకు అవకాశం లభిస్తుంది. ‘సర్జికల్‌ మాస్క్‌లు/ఒకసారి వాడి పారేసే మాస్క్‌లు, ఎన్‌బీఆర్‌ గ్లోవ్స్‌ తప్ప అన్ని రకాల గ్లోవ్స్‌ను ఎగుమతి చేసుకోవచ్చు’ అని ది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ ప్రకటించింది. అయితే, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన వస్తువులతో పాటు, ఎన్‌-95 మాస్క్‌లను ఎగుమతి చేసేందుకు వీలు లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని