ఆ డాక్టర్‌పై ప్రజా భద్రతా చట్టం..!

పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కఠినమనైన ప్రజా భద్రతా చట్టాన్ని(ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరిగిన నిరసనల్లో...........

Updated : 22 Dec 2022 17:11 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కఠినమైన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్‌ఏ) ప్రయోగించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరిగిన నిరసనల్లో భాగంగా విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణల కింద కఫీల్‌ను పోలీసులు గత నెల ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రపంగానికి సంబంధించిన కేసులో బెయిల్‌ లభించినప్పటికీ ఆయన్ని ఇంకా జైల్లోనే ఉంచారు. తాజాగా ఎన్‌ఎస్‌ఏ ప్రయోగించడంతో ఇక జైల్లోనే ఉంటారని పోలీసు అధికారి ఆకాశ్‌ కుల్హరి తెలిపారు. ఓ వ్యక్తి వల్ల దేశ ప్రయోజనాలు లేదా శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తే అతనిపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగించే అధికారం ఉంటుంది. ముందస్తు చర్యల్లో భాగంగా సదరు వ్యక్తిని జైల్లోనే ఉంచవచ్చు.

డిసెంబర్‌ 12న సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం(ఏఎంయూ)లో జరిగిన నిరసనల్లో కఫీల్‌ ఖాన్‌ ప్రసంగించారు. ఆయన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా ఉన్నాయని అలీగఢ్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కఫీల్‌ని ముంబయి ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అలీగఢ్‌ ఠాణాకు తరలించారు. 2017లో గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో 60 మంది చిన్నారుల మరణాల కేసులోనూ కఫీల్‌ అరెస్టయ్యారు. అనంతరం జరిగిన విచారణలో ఆయన నిర్దోషిగా తేలారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు