అమెరికాలో కాల్పులు.. భారతీయుడి మృతి

గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మణిందర్‌ సింగ్‌ సాహి(31) అనే వ్యక్తి లాస్‌ ఏంజలస్‌........

Published : 24 Feb 2020 10:08 IST

లాస్‌ ఏంజిల్స్: గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మణిందర్‌ సింగ్‌ సాహి(31) అనే వ్యక్తి లాస్‌ ఏంజిల్స్‌  సమీపంలోని విట్టియర్‌ ప్రాంతంలో ఓ నిత్యావసర వస్తువుల దుకాణంలో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 5.43 గంటల సమయంలో ముసుగు ధరించిన ఓ దుండగుడు తుపాకితో దుకాణంలోకి ప్రవేశించాడు. డబ్బులు ఇవ్వమని డిమాండ్‌ చేయడంతో మణిందర్‌ అలాగే చేశాడు. డబ్బు అందుకున్న వెంటనే అతనిపై దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మణిందర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగులు దొంగతనం కోసమే వచ్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

మణిందర్‌ హరియాణాలో కర్నల్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అక్కడే ఉంటున్న అతని సోదరుడు తెలిపారు. ఉపాధి కోసం ఆరు నెలల క్రితమే మణిందర్‌ అమెరికాకు వచ్చాడన్నారు. మణిందర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడ సంపాదించిన డబ్బును ప్రతినెలా ఇంటికి పంపేవాడని పేర్కొన్నాడు. మణిందర్‌ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ అతని సోదరుడు ‘గోఫండ్‌మీ’ పేజ్‌ క్రియేట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని