క్యాబ్ డ్రైవర్‌ నిద్ర: కారు నడిపిన మహిళ

సాధారణంగా మనం క్యాబ్ బుక్‌ చేసుకున్నప్పుడు డ్రైవర్‌ కారు నడుపుతుంటే మనం వెనక సీట్లో కూర్చొని సేద తీరుతాం. కానీ దీనికి భిన్నంగా క్యాబ్‌ బుక్‌ చేసుకొన్న వ్యక్తి డ్రైవర్‌ని కూర్చొబెట్టుకొని కారు.....

Published : 05 Mar 2020 10:39 IST

ముంబయి: సాధారణంగా మనం క్యాబ్ బుక్‌ చేసుకున్నప్పుడు డ్రైవర్‌ కారు నడుపుతుంటే మనం వెనక సీట్లో కూర్చొని విశ్రాంతి తీసుకొంటాము. కానీ, దీనికి భిన్నంగా క్యాబ్‌ బుక్‌ చేసుకొన్న వ్యక్తే డ్రైవర్‌ని పక్కన కూర్చొబెట్టుకొని వాహనం నడుపుకొంటూ గమ్యస్థానానికి చేరుకొంటే.. ముంబయిలో ఇలాంటి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఫిబ్రవరి 21 ముంబయిలో చోటుచేసుకొంది. దీని సంబంధించిన వీడియోను బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

తేజస్విని దివ్య నాయక్ అనే 28 ఏళ్ల మహిళ పుణె నుంచి ముంబయిలోని అంథేరీలో తన ఇంటికి  వెళ్లేందుకు ఫిబ్రవరి 21 క్యాబ్‌ బుక్‌ చేసుకొంది. అయితే సదరు క్యాబ్ డ్రైవర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా కారు నడుపుతుండటంతో ఆమె అతణ్ని ఫోన్‌ మాట్లాడటం ఆపి జాగ్రత్తగా కారు నడపాలని కోరింది. దీంతో అతను ఫోన్‌ మాట్లాడటం ఆపి కారు నడుపుతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అలా అతను కొంత దూరం వెళ్లిన తర్వాత ఎదురుగా వస్తున్న కారును తప్పించిబోయి డివైడర్‌ను ఢీ కొట్టబోయాడు. ఇది గమనించిన దివ్య అతణ్ని కాసేపు నిద్ర పొమ్మని చెప్పి.. వెన్ను నొప్పితో బాధపడుతున్నప్పటికీ తానే డ్రైవింగ్ చేసింది.

తాను కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్‌ నిద్ర పోకుండా ఫోన్‌లో మాట్లాడుతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడని తెలిపారు. అలా అతను నిద్ర పోతున్న సమయంలో తీసిన ఫొటోలను, వీడియోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఉబెర్‌ సంస్థకు ట్యాగ్ చేశారు. ఇంకా కొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటామనగా డ్రైవర్‌ నిద్రలేచి కారు నడిపినట్లు దివ్య వెల్లడించారు. అయితే దానిపై స్పందించిన ఉబెర్‌ సంస్థ, జరిగిన ఘటన బాధాకరమని.. సదరు డ్రైవర్‌ని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని