దక్షిణాసియా దేశాల్లో పకడ్బందీగా ‘లాక్‌డౌన్‌’

మనీలా: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దక్షిణాసియా దేశాలు లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేస్తున్నాయి. తమ ప్రధాన నగరాల్లో రాకపోకలపై పూర్తి నిషేధం విధించాయి. అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ కావడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే దారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.        

Published : 03 Apr 2020 21:58 IST

మనీలా: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దక్షిణాసియా దేశాలు లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేస్తున్నాయి. తమ ప్రధాన నగరాల్లో రాకపోకలపై పూర్తి నిషేధం విధించాయి. అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ కావడంతో ఎప్పుడూ రద్దీగా ఉండే దారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.  దక్షిణాసియాలోని ప్రధాన నగరాలైన ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా, వియత్నాంలోని నగరాలు, థాయ్‌లాండ్‌ నగరం బ్యాంకాక్‌, ఇండోనేషియా రాజధాని జకర్తా, మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని నగరాలన్నీ వెలవెలబోతున్నాయి.

ఫిలిప్పీన్స్‌లో లాక్‌డౌన్‌ను ఉల్లఘించి రోడ్లపైకి వస్తే కాల్చి చంపేందుకు ఉత్తర్వులిస్తామని ఆ దేశాధ్యక్షుడు ప్రకటించిన వేళ ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. బ్యాంకాక్‌లోని పర్యాటక కేంద్రమైన ‘ది గ్రాండ్‌ ప్యాలెస్‌’ ప్రాంతమంతా రకరకాల వీధి వ్యాపారాలతో కళకళలాడేది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాంతమంతా కళ తప్పినట్లయింది. నిత్యం వాహన రద్దీ ఉండే జకర్తా, కౌలాలంపూర్‌లోని రోడ్లపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని