ఎయిర్‌ ఇండియా పైలట్లకు కరోనా!

అత్యవసర సమయంలో సేవలందిస్తోన్న వారికి కరోనా వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఐదుగురు ఎయిర్‌ ఇండియా పైలెట్లకు కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 10 May 2020 16:00 IST

ముంబయి: అత్యవసర సమయంలో సేవలందిస్తోన్న వారికి కరోనా వైరస్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఐదుగురు ఎయిర్‌ ఇండియా పైలట్లకు కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. వీరందరూ చైనాకు కార్గో విమానాలు నడిపిన వారేనని అధికారులు గుర్తించారు. అయితే వీరిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. అత్యవసర సేవల్లో భాగంగా వైద్య సామగ్రి తరలింపు కోసం ఎయిర్‌ ఇండియా కార్గో విమానాలు నడుపుతోంది.

అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విమానం బయలుదేరేముందు, తిరిగి వచ్చిన తర్వాత పైలట్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా కొవిడ్‌-19 నిర్ధారణకు చేసే స్వాబ్‌ పరీక్షలు నిర్వహించిన  తర్వాతే విమానం నడుపేందుకు అనుమతి ఇస్తున్నారు. తిరిగి వచ్చిన అనంతరం కూడా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాతే వారిని ఇంటికి పంపిస్తున్నారు. ఇలా చేసిన పరీక్షల్లోనే వీరికి కరోనా వైరస్‌ ఉందని తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని