మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు

దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ వెల్లడించారు. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు సమాచారం అందించామని పేర్కొన్నారు....

Published : 20 May 2020 17:46 IST

దశల వారీగా సేవల పునరుద్ధరణ: హర్దీప్‌సింగ్‌ పూరీ

దిల్లీ: దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ వెల్లడించారు. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ ముప్పుతో మార్చి చివర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో సరకు రవాణా, కొన్ని ప్రత్యేక సేవల విమానాలు మాత్రం నడిచాయి. ‘2020, మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ఆరంభమవుతాయి. దశల వారీగా సేవలు పుంజుకుంటాయి. అన్ని విమానాశ్రయాలు, సంస్థలకు సమాచారం అందించాం. సిద్ధంగా ఉండాలని సూచించాం. ప్రయాణికుల కదలికలు, జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది’ అని హర్దీప్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని