పైలట్‌కు కరోనా.. విమానం వెనక్కి

పైలట్‌కు కరోనా నిర్ధారణ కావడంతో దిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయలు దేరిన ఎయిరిండియా విమానం మధ్యలోనే వెనుదిరిగింది.

Published : 31 May 2020 00:45 IST

దిల్లీ: పైలట్‌కు కరోనా నిర్ధారణ కావడంతో దిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కోకు బయలు దేరిన ఎయిరిండియా విమానం మధ్యలోనే వెనుదిరిగింది. విమానంలో ఓ పైలట్‌కు వైరస్ సోకిందని గుర్తించడంతో విమానయాన సంస్థ వందే భారత్ మిషన్‌లో భాగంగా కేటాయించిన విమానాన్ని వెనక్కి రప్పించింది. 
‘వందే భారత్ మిషన్‌లో భాగంగా రష్యాలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి మాస్కోకు బయలుదేరిన ఏ320 విమానం మధ్యలోనే వెనుతిరిగింది. పైలట్‌ కరోనా బారిన పడ్డారని సిబ్బంది గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ విమానంలో ప్రయాణికులు ఎవరు లేరు’ అని ఎయిరిండియా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆ విమానం శనివారం అర్ధరాత్రి దిల్లీకి చేరుకుంటుందని తెలిపారు. సిబ్బంది క్వారంటైన్‌లో ఉంటారని, మాస్కోకు మరో విమానాన్ని పంపిస్తామని వెల్లడించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని