అక్కడ రెండు పాత వెంటిలేటర్లే ఉన్నాయి

పొరుగు దేశం పాకిస్థాన్‌లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్యలో ఇప్పటికే చైనాను దాటేసింది.

Published : 05 Jun 2020 16:51 IST

ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్థాన్‌లో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్యలో ఇప్పటికే చైనాను దాటేసింది. అయితే గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. చైనాకు సరిహద్దులో ఉన్న ఆ ప్రాంతంలో 800 మంది కరోనా బారినపడ్డారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు తిండి గింజలు, కనీస వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. 

అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం..గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో రెండు పాత మోడల్‌ వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆ ప్రాంతానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ అంజాద్ అయూబ్ మీర్జా ట్వీట్ చేసినట్లు తెలిపింది. ఈ పరిస్థితిపై ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘వారికి(ప్రభుత్వం) విరాళాలు, నిధులు అందుతున్నాయి. వాటిని వారి సొంత పనులకోసం వాడుతున్నారు కానీ, ప్రజల కోసం కాదు. వారిని అధికారంలోకి తీసుకువచ్చిన వారిలో ఈ ప్రజలు కూడా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయారు. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు హక్కులు కోల్పోయారు. ఇక కరోనా వైరస్‌తో నిరుద్యోగం దారుణంగా పెరిగిపోతుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 85,264కు చేరింది. గత 24 గంటల్లో 4,688 కొత్త కేసులు నమోదయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. 
ఇవీ చదవండి:

చైనాను దాటిన పాక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని