కొమ్ము దమ్ము ఏంటో తెలిసింది
మానవ కణాల్లోకి ఇన్‌ఫెక్షన్ చొప్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ గురించి
లెక్సింగ్టన్: మానవ కణాల్లోకి ఇన్‌ఫెక్షన్ చొప్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ గురించి శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. సమర్థ వ్యాక్సిన్లు, ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఈ ఆవిష్కారం వీలు కల్పిస్తుందని వారు తెలిపారు. అమెరికాలోని కెంటకీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
కొవిడ్-19 కారక కరోనా వైరస్ ఉపరితలంపై కొమ్ము ఆకృతిలో ఈ స్పైక్ ప్రొటీన్ ఉంటుంది. మానవుల్లో ఇన్‌ఫెక్షన్‌ను కలిగించడంలో ఇది పోషిస్తున్న పాత్ర దృష్ట్యా అనేక వ్యాక్సిన్లకు లక్ష్యంగా మారింది. ‘‘ఈ ప్రొటీన్ పనితీరుపై మరింత సమగ్ర అవగాహనకు మా పరిశోధన దోహదపడుతోంది’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన బెకీ డచ్ చెప్పారు. ఈ స్పైక్ ప్రొటీన్ ఎంత స్థిరంగా ఉంటుంది, కణాల మధ్య ఇన్‌ఫెక్షన్ వ్యాప్తికి ఎలా దోహదపడుతోంది.. వంటి అంశాలను తాము వెలుగులోకి తెచ్చామన్నారు. కరోనాలో తలెత్తే ఉత్పరివర్తనలు ఈ ప్రొటీన్ స్థిరత్వం, పనితీరుపై చూపే ప్రభావాన్ని పరిశీలించారు. మానవులను ఇంతలా కలవరపెడుతున్న ఈ స్పైక్ ప్రొటీన్ ఆయువు 24 గంటలేనని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆలోపే చాలావరకూ అవి క్షీణిస్తాయని గుర్తించారు. ఇన్‌ఫెక్షన్ ప్రక్రియ, వ్యాక్సినేషన్‌పై మరింత అవగాహనకు ఈ ఆవిష్కారం వీలు కల్పిస్తుంది. ఎందుకంటే ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు.. స్పైక్ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయాలని మానవ కణాలకు సూచనలు అందిస్తాయి. వాటి ఆధారంగా మానవరోగ నిరోధక వ్యవస్థ స్పందించి.. యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!