Helicopter Crash: దేశంలో ‘ఎంఐ-17వీ5’ ప్రమాదాలు ఇలా...

2019 ఫిబ్రవరి 27: జమ్మూ-కశ్మీర్‌లో ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ నేలకూలి, ఏడుగురు చనిపోయారు. పొరపాటున మన క్షిపణి

Updated : 09 Dec 2021 12:12 IST

దిల్లీ: 2019 ఫిబ్రవరి 27: జమ్మూ-కశ్మీర్‌లో ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ నేలకూలి, ఏడుగురు చనిపోయారు. పొరపాటున మన క్షిపణి దాడి వల్లే ఈ దుర్ఘటన జరిగింది. భారత వాయుసేనకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ దీన్ని శత్రు డ్రోన్‌గా పొరబడి, స్పైడర్‌ క్షిపణిని ప్రయోగించింది. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడి చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.

- 2017 అక్టోబరు 6: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ లోయలో ఈ శ్రేణి హెలికాప్టర్‌ కూలి, ఏడుగురు రక్షణ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. 

- 2013 జూన్‌ 25: భారీ వర్షాలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లోని సహాయ చర్యలు సాగిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ కూలి 8 మంది మృతిచెందారు. 

ఎంఐ-17 హెలికాప్టర్‌ ప్రమాదాలు

ఈ లోహవిహంగాల శ్రేణిలో ఎంఐ-17 హెలికాప్టర్లు కూడా నేలకూలాయి. 

- 2021 నవంబరు 18: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని రోచామ్‌లో ఎంఐ-17 కూలి ఐదుగురు మరణించారు.

- 2018 జులై 14: ఉత్తరాఖండ్‌లోని చమోలీలో కూలిన హెలికాప్టర్‌.  

- 2012 ఆగస్టు 31న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఢీకొని, 9 మంది వాయుసేన సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. 

- 2011 ఏప్రిల్‌ 19: పవన్‌ హాన్స్‌కు చెందిన లోహవిహంగం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతంలో కూలి 17 మంది చనిపోయారు. పైలట్, మరో ఐదుగురు గాయాలతో తప్పించుకున్నారు.

- 2010 నవంబర్‌ 19: తవాంగ్‌కు చేరువలో వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ కూలి 12 మంది మరణించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని