China: రావత్‌ మృతి ఘటనపై చైనా కారుకూతలు..

పొరుగు దేశం చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది.

Updated : 11 Dec 2021 15:13 IST

బీజింగ్‌: పొరుగు దేశం చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం పాలైన నేపథ్యంలో మన సైన్యాన్ని అవహేళన చేస్తూ కారుకూతలు కూసింది. భారత మిలిటరీకి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత కూడా కరవేనని వ్యాఖ్యానించింది. పలువురు సైనిక నిపుణుల అభిప్రాయాలతో ప్రభుత్వరంగ వార్తాసంస్థ ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. భారత బలగాలు ప్రామాణిక నిర్వహణ విధానాలను పాటించరని, వారికి క్రమశిక్షణ లేదని అందులో పేర్కొంది. జనరల్‌ రావత్‌ మృత్యువాతపడ్డ హెలికాప్టర్‌ ప్రమాదం మానవతప్పిదం వల్లే జరిగిందని అభిప్రాయపడింది. గతంలోనూ భారత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపింది. వాతావరణం మెరుగుపడేంతవరకు ప్రయాణాన్ని వాయిదా వేసి ఉన్నా, పైలట్‌ మరింత నైపుణ్యవంతంగా నడిపినా, క్షేత్రస్థాయిలోని సిబ్బంది మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. తమిళనాడులో బుధవారం నాటి హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకొని ఉండేది కాదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని