త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జశ్వంత్ సింగ్!
ప్రస్తుతం ఒడిశా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ జశ్వంత్ సింగ్‌ను త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీం కోర్టు కొలీజియం మళ్లీ సిఫారసు చేసింది.
మళ్లీ సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
దిల్లీ: ప్రస్తుతం ఒడిశా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ జశ్వంత్ సింగ్‌ను త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీం కోర్టు కొలీజియం మళ్లీ సిఫారసు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా జస్టిస్ జశ్వంత్ సింగ్‌కు పదోన్నతి కల్పించి త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ గతేడాది సెప్టెంబరు 28న కొలీజియం తీసుకున్న నిర్ణయాన్నే తిరిగి సిఫారసు చేస్తూ తీర్మానాన్ని అమోదించింది. జస్టిస్ సింగ్ ఫిబ్రవరి 23, 1961లో హరియాణాలోని రోహ్‌తక్‌లో జన్మించారు. సిర్సాలోని జిల్లా కోర్టుల్లో 1986 నుంచి ప్రాక్టిస్ ప్రారంభించారు. డిసెంబరు 5, 2007లో పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అక్కడ నుంచి అక్టోబరు 8, 2021లో ఒడిశా హైకోర్టుకు బదిలీ అయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
World News
Rupert Murdoch: 92ఏళ్ల వయసులో ‘ఐదో’ పెళ్లి..! ఇదే చివరిదన్న బిలియనీర్
-
Sports News
MS Dhoni: ఐపీఎల్.. ధోనీకి మరో 3-4 ఏళ్లు ఆడే సత్తా ఉంది: షేన్ వాట్సన్