ఆకట్టుకుంటున్న మినీయేచర్‌ రైలు మ్యూజియం

ఆ మినీయేచర్‌ నగరంలో స్టీమ్‌ ఇంజిన్‌ నుంచి బుల్లెట్‌ రైళ్లదాకా అన్ని రకాల రైళ్లూ అటూఇటూ తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Published : 06 Mar 2023 03:52 IST

ఆ మినీయేచర్‌ నగరంలో స్టీమ్‌ ఇంజిన్‌ నుంచి బుల్లెట్‌ రైళ్లదాకా అన్ని రకాల రైళ్లూ అటూఇటూ తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సిగ్నళ్లు లేని రోడ్లపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. అన్ని రకాల వినోదాలకు ఇక్కడ కొదవ లేదు. ఈ మినీయేచర్‌ నగరం ఏ ఐరోపా దేశంలోనిదో కాదు.. ఉన్నది మన మహారాష్ట్రలోని పుణెలో. నీళ్లలో పరుగులు పెట్టే పడవలు, స్టీమర్లు... అందమైన కొండల అంచున రోప్‌వేలు.. వినోదాలు పంచే హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, రోలర్‌ కోస్టర్‌, జెయింట్‌ వీల్‌ రైడ్లు మనసును దోచేస్తాయి. ఇక రాత్రి అయితే గ్రహాలు, నక్షత్రాలు మిలమిల మెరుస్తూ కనువిందు చేస్తాయి. బాలకృష్ణ శంకర్‌ అలియాస్‌ భావూ జోషి అనే వ్యక్తికి రైలు ఇంజిన్‌ సూక్ష్మ రూపాలు తయారు చేయడమంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో.. వాటిని తయారు చేసేవారు. అలా మొదలైన ఆయన ఆసక్తే.. మినియేచర్‌ రైలు మ్యూజియం ఏర్పాటుకు కారణమైంది. ఆ మ్యూజియంలోనే ఈ మినీయేచర్‌ నగరం ఉంది. అందులో హైవేలు, పెద్ద పెద్ద భవంతులు.. వినోదం, విహారం కోసం పార్కులు, సర్కస్‌ లాంటి వసతులన్నీ ఉన్నాయి. గృహ సముదాయాలు, ఫ్యాక్టరీలూ ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని