డ్రమ్స్‌తో అదరగొడుతున్న రెండున్నరేళ్ల మిహన్‌

రెండున్నరేళ్ల బాలుడు అద్భుతంగా డ్రమ్స్‌ వాయిస్తూ చూపరులను ఆకట్టుకొంటున్నాడు. కేరళలోని తెయ్యం ఉత్సవాల్లో కళాకారులు నృత్యం చేస్తుండగా సంప్రదాయ వాద్యం చెండా (డ్రమ్స్‌) వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా మారాడు కోజికోడ్‌కు చెందిన మిహన్‌.

Published : 25 Mar 2023 04:54 IST

రెండున్నరేళ్ల బాలుడు అద్భుతంగా డ్రమ్స్‌ వాయిస్తూ చూపరులను ఆకట్టుకొంటున్నాడు. కేరళలోని తెయ్యం ఉత్సవాల్లో కళాకారులు నృత్యం చేస్తుండగా సంప్రదాయ వాద్యం చెండా (డ్రమ్స్‌) వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా మారాడు కోజికోడ్‌కు చెందిన మిహన్‌. ఉత్తర కేరళలో తెయ్యం సంప్రదాయ నృత్యం. దీన్ని కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ పాటిస్తారు. కోజికోడ్‌లోని అన్నసెరీ మనతనాథ్‌ ఆలయంలో మార్చి 14న తెయ్యం ఉత్సవం జరిగింది. ఆ పండగలో మిహన్‌ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెయ్యం నృత్యకారులు మిహన్‌ను మధ్యలో ఉంచి.. అతడి చుట్టూ నృత్యం చేశారు. చిన్ని చేతులతో శరవేగంగా డ్రమ్స్‌ వాయిస్తున్న బాలుణ్ని చూసి చెండా కళాకారులు ఆశ్చర్యపోయారు. కోజికోడ్‌లోని పుత్యంగడి ప్రాంతానికి చెందిన ప్రబిల్‌, అనూష దంపతుల కుమారుడే మిహన్‌. ప్రబిల్‌ వ్యాపారవేత్త కాగా.. అనూష కలెక్టరేట్‌లో సర్వేయర్‌. వీరిద్దరూ నిత్యం వారి పనులకు వెళుతూ మిహన్‌ను అతడి మామయ్య ఇంట్లో విడిచిపెట్టి వెళతారు. మావయ్యతో కలిసి గుడికి వెళ్లిన మిహన్‌కు డ్రమ్స్‌ కొనిచ్చారు. మొదట్లో ఒకట్రెండు పగలగొట్టినా, క్రమంగా లయబద్ధంగా వాయించడం మొదలుపెట్టాడు. ఇక అప్పటినుంచి ఎక్కడికి వెళ్లినా, ఏ పండుగ వచ్చినా.. మిహన్‌ వాయిద్యం తప్పనిసరిగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని