నిరాడంబరంగా నిర్మలా సీతారామన్‌ కుమార్తె పెళ్లి

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి వివాహం వరుడు ప్రతీక్‌తో అత్యంత నిరాడంబరంగా జరిగింది.

Updated : 09 Jun 2023 06:44 IST

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వాజ్ఞ్మయి వివాహం వరుడు ప్రతీక్‌తో అత్యంత నిరాడంబరంగా జరిగింది. అతికొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో బెంగళూరులోని మంత్రి ఇంట్లోనే బుధవారం ఈ పెళ్లి వేడుకను పూర్తి చేశారు. రాజకీయ ప్రముఖులెవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పురోహితులు వివాహ క్రతువు నిర్వహించారు. పెళ్లి సమాచారాన్ని సీతారామన్‌ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించకున్నా.. వివాహ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు