Toothbrush: దంతధావనం చేస్తూ టూత్‌బ్రష్‌ మింగేశాడు

సాధారణంగా చిన్నపిల్లలు నాణేలు, రింగుల వంటివి మింగారని వింటుంటాం. రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్‌లో ఓ పెద్దాయన దంతధావనం చేస్తూ 12 సెంటీమీటర్ల టూత్‌బ్రష్‌ను మింగేయటం వైద్యులను ఆశ్చర్యపరచింది.

Updated : 20 Jul 2023 07:44 IST

సాధారణంగా చిన్నపిల్లలు నాణేలు, రింగుల వంటివి మింగారని వింటుంటాం. రాజస్థాన్‌లోని చిత్తౌడ్‌గఢ్‌లో ఓ పెద్దాయన దంతధావనం చేస్తూ 12 సెంటీమీటర్ల టూత్‌బ్రష్‌ను మింగేయటం వైద్యులను ఆశ్చర్యపరచింది. ఉదయ్‌పుర్‌లోని జీబీహెచ్‌ అమెరికన్‌ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సతో పనిలేకుండా ఆయన పొట్ట నుంచి టూత్‌బ్రష్‌ను వెలికితీయడం విశేషం. సీటీ స్కాన్‌లో పొట్ట పైభాగంలో ఇరుకొన్నట్లు కనిపించిన టూత్‌బ్రష్‌ను ఎండోస్కోపిక్‌ విధానంలో డాక్టర్‌ శశాంక్‌ జె.త్రివేది బృందం ఆ వ్యక్తి నోటి నుంచి బయటకు తీసింది.

 ఈటీవీ భారత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని