పల్లెటూరి ‘లక్కీ’ లైబ్రరీ.. ఒకే ఏడాదిలో 19 మందికి ఉద్యోగాలు

అదో మారుమూల పల్లెటూరు. గిరిజన ప్రాంతం కావడం వల్ల అక్కడ మౌలిక సదుపాయాలూ అంతంతమాత్రమే. కానీ అక్కడ ఆ గ్రామస్థులు అద్భుతమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Updated : 21 Nov 2023 07:46 IST
దో మారుమూల పల్లెటూరు. గిరిజన ప్రాంతం కావడం వల్ల అక్కడ మౌలిక సదుపాయాలూ అంతంతమాత్రమే. కానీ అక్కడ ఆ గ్రామస్థులు అద్భుతమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా ఒక్క ఏడాదిలోనే గ్రామానికి చెందిన 19 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా పావ్‌డి గ్రామంలో ఈ గ్రంథాలయం ఉంది. విద్యార్థులకు సహకారం అందించాలనే లక్ష్యంతో గ్రామస్థులంతా కలిసి 2017లో ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆ తర్వాత 2018లో ఓ ఇంటిని ప్రత్యేకంగా దీని కోసం కేటాయించారు. ‘‘2022-23 మధ్యలో 19 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించారు. వీరిని చూసి గ్రామంలోని మిగతా యువత ప్రేరణ పొందాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాం’’ అని లైబ్రరీ వ్యవస్థాపకులు సంజయ్‌ భాబోర్‌ పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు