ఆయన శరీరంలో చిప్‌ సంగతేంటో చూడండి: పోలీసులను ఆదేశించిన ముంబయి కోర్టు

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన శరీరంలో మైక్రో చిప్‌ను అమర్చి తన సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాక్‌ చేశారన్న ఓ వ్యక్తి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టాలంటూ ముంబయిలోని మేజిస్ట్రేట్‌ కోర్టు పోలీసులను కోరింది.

Updated : 17 Jan 2024 07:38 IST

ముంబయి: కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన శరీరంలో మైక్రో చిప్‌ను అమర్చి తన సామాజిక మాధ్యమాల ఖాతాలను హ్యాక్‌ చేశారన్న ఓ వ్యక్తి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టాలంటూ ముంబయిలోని మేజిస్ట్రేట్‌ కోర్టు పోలీసులను కోరింది. ఈ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలంటూ చార్‌కాప్‌ పోలీసులను బొరివలి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ బి.ఎన్‌.చిక్నే ఆదేశించారు. ఈ అంశంలో తుది నివేదికను వీలైనంత త్వరగా తనకు అందించాలంటూ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని