గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీకి బాందాలో అత్యవసర చికిత్స

యూపీ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (60)కి మంగళవారం బాందా వైద్య కళాశాలలో అత్యవసర చికిత్స అందించారు.

Updated : 27 Mar 2024 05:40 IST

బాందా/లఖ్‌నవూ: యూపీ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (60)కి మంగళవారం బాందా వైద్య కళాశాలలో అత్యవసర చికిత్స అందించారు. కడుపునొప్పి, మూత్ర విసర్జనలో  సమస్యతో తెల్లవారుజామున ఆయనను ఆసుపత్రికి తెచ్చారు. చికిత్స అనంతరం సాయంత్రం 5.45కు ఐసీయూ నుంచి డిశ్చార్జి చేయగా.. పోలీసు అధికారులు మళ్లీ జైలుకు తరలించినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సునీల్‌ కౌశల్‌ తెలిపారు. గతంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్తార్‌ అన్సారీపై 60కు పైగా క్రిమినల్‌ కేసులు ఉండగా.. దాదాపు గత 20 ఏళ్లుగా పంజాబ్‌, యూపీ జైళ్లలో ఈయన ఉంటున్నారు. ‘‘ఖైదీ ముఖ్తార్‌ అన్సారీ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో రాత్రి ఆయన మరుగుదొడ్లో కిందపడ్డారు. జైలు వైద్యుల పరిశీలన అనంతరం బాందా వైద్య కళాశాలకు తరలించాం’’ అని జైళ్లశాఖ లఖ్‌నవూలో ఓ ప్రకటన విడుదల చేసింది.

స్లో పాయిజన్‌ ఇస్తున్నారు: గాజీపుర్‌ ఎంపీ

తన సోదరుడైన ముఖ్తార్‌ అన్సారీకి జైలులో ‘స్లో పాయిజన్‌’ ఇస్తున్నారని ఆసుపత్రికి చేరుకొన్న గాజీపుర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపించారు. ‘‘జైలు ఆహారంలో తనకు విషం పెడుతున్నారని ముఖ్తారే చెబుతున్నారు. ఇలా జరగటం ఇది రెండోసారి’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని