బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి

అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం సీజేఐ ఛాంబర్లో విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 30 Apr 2024 04:41 IST

దిల్లీ: అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం సీజేఐ ఛాంబర్లో విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటితో, బాలిక తల్లిదండ్రుల తరఫు న్యాయవాదితో న్యాయమూర్తులు మాట్లాడారు. గర్భవిచ్ఛిత్తి తదనంతర పరిణామాల దృష్ట్యా తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని బాలిక తల్లిదండ్రులు వీడియో మాధ్యమం ద్వారా ధర్మాసనానికి తెలిపారు. ప్రసవం అయ్యేవరకు తాము నిరీక్షిస్తామని చెప్పారు. బాలిక క్షేమమే పరమావధిగా పేర్కొన్న సీజేఐ.. ఇదివరకటి ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. మహారాష్ట్రకు చెందిన బాధితురాలి గర్భవిచ్ఛిత్తికి బొంబాయి హైకోర్టు ఈ నెల 4న అనుమతి నిరాకరించింది. దాంతో ఆమె తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైద్యుల పర్యవేక్షణలో అబార్షన్‌ జరిపేందుకు ధర్మాసనం గతవారం అనుమతించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని