ఐఎఫ్‌ఎస్‌కు 147 మంది ఎంపిక

యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

Published : 09 May 2024 04:50 IST

ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

దిల్లీ: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గతేడాది నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు మెయిన్‌ పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 22 నుంచి మే 1 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలు వెలువడ్డాయి. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ర్యాంకర్ల జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. వీరిలో మొత్తం 147 మందిని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు రికమెండ్‌ చేసింది. జనరల్‌ కేటగిరీలో 43 మందిని ఎంపిక చేయగా.. ఈడబ్ల్యూఎస్‌ 20, ఓబీసీ 51, ఎస్సీ 22, ఎస్టీ 11 మంది చొప్పున ఎంపికయ్యారు. రిత్విక పాండే, కాలె ప్రతీక్ష నానా సాహెబ్‌, స్వస్తిక్‌ యదువంశీ తొలి మూడు ర్యాంకులు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని