Modi: గోవాలో కొత్త విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే!

గోవాలోని మోపాలో రూ.2,870 కోట్లతో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించారు. ఏడాదికి 44 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా ఉన్న ఈ ఎయిర్‌పోర్టు ప్రత్యేకతలేంటో తెలుసా?

Updated : 11 Dec 2022 22:56 IST

పనాజీ:  గోవా(Goa)లోని మోపాలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయాన్ని(Airport) ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఈ విమానాశ్రయం విశేషాలేంటి?

  • గోవాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా దీనిని నిర్మిస్తున్నారు. గోవా ఉత్తర ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అందువల్ల టూరిజం అభివృద్ధికి విమానాశ్రయం మరింత దోహదం చేస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ప్రజలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంలో అక్కడి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది.
  • ఏడాదికి 85 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా డబోలిమ్‌ ఎయిర్‌పోర్టు ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ, ఇందులో కార్గో సేవలకు అవకాశం లేదు. ఈ సమస్యను మోపాలోని ఎయిర్‌పోర్టుతో అధిగమించవచ్చు.
  •  తొలివిడతగా ఏడాదికి 44 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా ఈ విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు. భవిష్యత్‌లో ఏడాదికి కోటి మంది ప్రయాణించేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.
  •  విమానాశ్రయ నిర్మాణ వ్యయం రూ.2,870 కోట్లు.
  • గోవాలో డబోలిమ్‌ ఎయిర్‌పోర్టు తర్వాత ఎక్కువ మందికి ఇదే అందుబాటులో ఉండనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని