Gmail: చాలా రోజులుగా జీమెయిల్ వాడటం లేదా? ఈ అలర్ట్ మీ కోసమే!
కనీసం రెండేళ్లకు మించి నిరుపయోగంగా ఉన్న జీమెయిల్, యూట్యూబ్ ఖాతాలను తొలగించాలని గూగుల్ నిర్ణయించింది. ఈ మేరకు వినియోగ దారులకు హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది.
ఇంటర్నెట్‌డెస్క్: జీ-మెయిల్ యూజర్లకు అలర్ట్.. వినియోగంలోని ఖాతాలకు సంబంధించి గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం రెండేళ్లకు మించి ఉపయోగంలోని జీ-మెయిల్, యూట్యూబ్ ఖాతాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇన్‌యాక్టివ్ అకౌంట్ పాలసీలో మార్పులు చేసింది. ఈ మార్పులకు సంబంధించి యూజర్లకు ఇప్పటికే హెచ్చరిక సందేశాలు కూడా పంపిస్తోంది. వెంటనే ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలని, లేదంటే వాటిని తొలగిస్తామని చెబుతోంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో వినియోగదారుల డేటా భద్రతను మరింత మెరుగు పరచుకోవచ్చని గూగుల్ చెబుతోంది.
థర్డ్ పార్టీ యాప్స్ లింక్ వద్దనుకుంటే?
సాధారణ ఖాతాల కంటే ఇన్‌యాక్టివ్ అకౌంట్లకు అథెంటికేషన్ ఫ్యాక్టర్ సెటప్ ప్రామాణికత 10 రెట్లు తక్కువగా ఉంటుందని, ఫలితంగా ఆ అకౌంట్‌ను హ్యాకర్లు సులభంగా స్వాధీనం చేసుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. ఆ ఖాతా ద్వారా పలువురికి తప్పుడు మెయిల్స్ పంపించి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశముందని గూగుల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే నిరుపయోగంగా ఉన్న ఖాతాలను తొలగించాలని నిర్ణయించినట్లు గూగుల్ వెల్లడించింది.
కొత్త విధానం డిసెంబరు 2023 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది. ఈ లోగా యూజర్లు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవాలని లేదంటే సంబంధిత ఖాతాతో ముడిపడి ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుందని పేర్కొంది. అంటే, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్, డాక్స్, మీట్, క్యాలెండర్, గూగుల్ ఫొటోలు తదితర డేటాను యూజర్ కోల్పోవాల్సి ఉంటుంది. అయితే, గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త విధానం కేవలం వ్యక్తిగత ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు, గేమింగ్ సంస్థలు, వ్యాపార సంస్థలు తదితర ఆర్గనైజేషన్లకు వర్తించదని గూగుల్ స్పష్టం చేసింది.
అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
- గూగుల్ అకౌంట్ ఉండి.. కనీసం 2 ఏళ్లుగా దానిని ఉపయోగించకపోతే... కచ్చితంగా ఆ మెయిల్ ఐడీ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
- అప్పటికే ఇన్‌బాక్స్‌లోకి వచ్చిన మెయిల్‌ను చదవండి. లేదంటే వేరే వాళ్లకి కనీసం ఒక మెయిల్ చెయ్యండి
- గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించండి
- జీమెయిల్ ఖాతాతో అనుసంధానించి యూట్యూబ్‌లో వీడియో చూడండి
- గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
- గూగుల్ సెర్చ్ ఆప్షన్‌ను వినియోగించండి
- మీ జీమెయిల్ ఖాతాతో ఏదైనా థర్డ్‌పార్టీ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
అయితే, మీ జీమెయిల్ అకౌంట్‌తో ఏదైనా గూగుల్ సర్వీసులను సబ్‌స్క్రైబ్ చేసుకొని ఉంటే.. 2 ఏళ్లకు మించి జీమెయిల్‌ను వాడకపోయినా.. వాటిని తొలగించడం వీలుపడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి