Gujarat Couple Padayatra: ద్వారక నుంచి తిరుపతికి  కాలినడకన పయనమైన వృద్ధ దంపతులు!

గుజరాత్ లోని ద్వారక నుంచి తిరుపతికి మధ్య దూరం దాదాపు 2,200 కిలోమీటర్లు. ఈ

Updated : 10 Aug 2021 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్ లోని ద్వారక నుంచి తిరుపతికి మధ్య దూరం దాదాపు 2,200 కిలోమీటర్లు. ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని కాలినడకతో చెరిపేయాలనుకుంటే సాహసమే అవుతుంది. అదీ ముదిమి వయస్సులో   ద్వారక సమీపంలో ఓ గ్రామానికి చెందిన ప్రమోద్‌ దంపతులు మూడు నెలల క్రితం తిరుపతికి కాలినడకన బయలు దేరారు.  వాళ్లకు కావలసిన సామాగ్రిని ఓ తోపుడు బండిపై పెట్టుకుని దాన్ని తోసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. 70 ఏళ్లు పైబడిన ఈ వృద్ధ దంపతులు రోజుకు కొంత దూరం నడుచుకుంటూ ఇప్పటి వరకూ 1,600 కి.మీ ప్రయాణం సాగించారు. ప్రస్తుతం కర్ణాటకలోని రాయచూర్‌ చేరుకున్నారు. మరో 500 కి.మీ ప్రయాణిస్తే తిరుపతి చేరుకుంటారు. 

కొన్నాళ్ల  క్రితం ప్రమోద్‌కి అనారోగ్యం కారణంగా కంటి సమస్యలు తలెత్తాయి. అతని  ఆరోగ్యం కుదుట పడితే కాలినడక తిరుపతి వస్తామని ప్రమోద్‌ భార్య మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి తొంబై రోజులుగా పాద యాత్ర చేస్తున్నారు ప్రమోద్‌ దంపతులు. పశ్చిమ, దక్షిణ భారతాన్ని మహా పాదయాత్రతో ఏకం చేస్తున్న వీరు మరో నెలరోజుల్లో శ్రీవారిని దర్శించనుంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని